Published : 24 Apr 2022 01:34 IST

Ashok Gehlot: ‘నా రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే’: రాజస్థాన్‌ సీఎం

జైపుర్‌: కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి ముసలం ఏర్పడింది. రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రిని మార్చనుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. ఇలా పుకార్లు సృష్టించడం సరికాదన్నారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరితే అందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ‘నా రాజీనామా లేఖ శాశ్వతంగా సోనియా గాంధీ వద్దనే ఉంటుంది. ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ నిర్ణయించినప్పుడు దాని గురించి ఎవరికీ హింట్‌ కూడా లభించదు. దానిపై ఎలాంటి చర్చ జరగదు. పార్టీ హైకమాండ్‌కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కానీ పుకార్లు వినిపిస్తున్నాయి. వాటిని పట్టించకోవద్దని అందరికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడంతో సీఎం మార్పు ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీ అధిష్ఠానంతో సచిన్ పైలట్ సమావేశం కావడం పక్షం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. సీఎం మార్పు అంశంపై పైలట్‌ మాట్లాడుతూ ‘అధిష్ఠానంతో ఈ విషయం గురించే చర్చలు జరిపా. హైకమాండ్‌దే తుది నిర్ణయం. రాష్ట్రంలోని పరిస్థితులపై సరైన ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వడం మన బాధ్యత. పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతోందో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది’ అని అన్నారు.

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో అంతర్గతంగా వివాదాలు ఎప్పట్నుంచో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఎం అశోక్‌ గహ్లోత్‌కు వ్యతిరేకంగా పైలట్‌ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో అశోక్‌, పైలట్‌ వర్గం మధ్య నెలకొన్న విభేదాలు ఈ అమస్మతికి కారణమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధిష్ఠానం పైలట్‌ను బుజ్జగించింది. ఆయన వర్గం లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమస్యలు మాత్రం పరిష్కారం కానట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని