Mynampally: మల్కాజిగిరి నుంచే పోటీ.. కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: మైనంపల్లి

మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) స్పష్టం చేశారు.

Published : 23 Sep 2023 14:31 IST

హైదరాబాద్‌: మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) స్పష్టం చేశారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నానంటూ వదంతులు పుట్టిస్తున్నారని అన్నారు. పలువురు కార్యకర్తలు ఇవాళ భారీగా తరలిరావడంతో మైనంపల్లి నివాసం వద్ద సందడి నెలకొంది. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలే ముఖ్యమని స్పష్టం చేశారు. అవసరమైతే కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మైనంపల్లి వెల్లడించారు. తమ కోసం బయటకు వచ్చిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని