JP Nadda: టార్గెట్‌ 2024.. భాజపా కొత్త ఇన్‌ఛార్జిలతో నడ్డా కీలక భేటీ!

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఆ పార్టీ రాష్ట్రాల ఇన్‌ఛార్జిలతో భేటీ అయ్యారు. పార్టీని సంస్థాగతంగా మరింత.....

Published : 28 Sep 2022 01:32 IST

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఆ పార్టీ రాష్ట్రాల ఇన్‌ఛార్జిలతో భేటీ అయ్యారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు 2024 సాధారణ ఎన్నికలకు సమాయత్తం కావడమే లక్ష్యంగా పలు అంశాలపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రాలకు భాజపా కొత్త ఇన్‌ఛార్జిలను నియమించిన తర్వాత వారందరితో నడ్డా భేటీ ఇదే తొలిసారి కావడం గమనార్హం. భాజపా కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నడ్డాతో పాటు భాజపా ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) సంతోష్ హాజరయ్యారు. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశాలపైనే కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌, భాజపా ప్రధాన కార్యదర్శులు అరుణ్‌ సింగ్, వినోద్‌ తాడ్వే, తరుణ్‌ చుగ్, సునీల్ బన్సల్‌ తదితరులు హాజరయ్యారు.

మరికొన్ని నెలల్లో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. వాటిపైనా భాజపా ఇప్పటికే ఫోకస్‌ పెట్టింది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఆయా రాష్ట్రాల్లో తమ అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జిలతో భేటీ అయిన నడ్డా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో భాజపా విజయ పతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని