Janasena: విశాఖ రాళ్లదాడి ఘటనపై స్పందించిన నాదెండ్ల మనోహర్
విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన రాళ్ల దాడి ఘటనపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైకాపా నాటకాలాడుతోందని విమర్శించారు.
విశాఖపట్నం: వైకాపా మంత్రుల వాహనాలపై విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన రాళ్ల దాడి ఘటనపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైకాపా నాటకాలాడుతోందని విమర్శించారు. ‘‘దాడి చేసింది జనసేన వాళ్లేనని పోలీసులు నిర్థారించలేదు. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో కోడికత్తి హడావుడి చేశారు. కోడికత్తి కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదు. కోడికత్తి పంథాలోనే ఇప్పడు కూడా దాడి జరిగిందని హడావుడి చేస్తున్నారు. ఇద్దరు మంత్రులపై దాడి జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. మంత్రుల మీద దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నట్టు? దాడి సంస్కృతిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదు. పవన్ పర్యటనకు బందోబస్తు కల్పించాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశాం. అయినా, నామమాత్రంగా బందోబస్తు కల్పించారు’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు