Nadendla manohar: రేషన్‌ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్‌

రేషన్‌ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పౌరసరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

Updated : 29 Jun 2024 17:26 IST

కాకినాడ: రేషన్‌ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పౌరసరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్‌ సరకులు వెళ్తున్నాయని తెలిపారు. రేషన్‌ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరతామన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

‘‘టోల్‌గేట్‌ల వద్ద సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతాం. కాకినాడలో తొలిరోజు తనిఖీల్లో 6 గోదాముల్లో లోపాలు గుర్తించాం. రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు గుర్తించాం. 7615 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌ చేశాం. కాకినాడలో ఒక వ్యవస్థీకృత మాఫియా ఏర్పడింది. ఇక్కడి రేషన్‌ మాఫియా సొంత నౌకనే ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఉంది. కాకినాడ పోర్టు అంటేనే అందరూ భయపడుతున్నారు. నిన్నటి తనిఖీల్లో ఆరు సంస్థల పాత్రను గుర్తించాం. వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని