Jana sena: జనసేన కార్యకర్తలకు ఇబ్బంది కలిగించొద్దు: నాదెండ్ల మనోహర్‌

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు విచ్చేసే కార్యకర్తలు, నాయకులకు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated : 14 Mar 2022 05:42 IST

ఇప్పటం: జనసేన పార్టీ ఆవిర్భావ సభకు విచ్చేసే కార్యకర్తలు, నాయకులకు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విజ్ఞప్తి చేశారు. పార్టీ నేత నాగబాబుతో కలిసి ఇప్పటం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జనసేన సభకు అన్ని ఏర్పాట్లు చేశామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

‘‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉంది. ప్రజల అభిప్రాయం మేరకు వారి పక్షాన నిలబడి పోరాడుతాం. క్రమశిక్షణతో పనిచేసే పార్టీ జనసేన. జిల్లాల నుంచి తరలివచ్చే నాయకులు, కార్యకర్తలకు పోలీస్‌శాఖ సహకరించాలని కోరుతున్నాం. జనసేన ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నాం. సభకు ఆటంకాలు కలిగించే ఆలోచనలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. దామోదరం సంజీవయ్య విలువల్ని మా పార్టీ  పాటిస్తోంది. ఆయన విలువల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభా వేదికకు సంజీవయ్య పేరు పెట్టాం. మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. జనసైనికులంతా సురక్షితంగా సభకు వచ్చి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ శ్రేణులంతా రేపు ఉదయానికే సభ వద్దకు చేరుకోవాలి. ఈ సభ ద్వారా పవన్‌ కల్యాణ్‌ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారు. జనసేన విజయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ అని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని