Andhra news: రహస్య నివేదిక ఎలా లీకైంది... డీజీపీ సమాధానం చెప్పాలి? : నాదెండ్ల మనోహర్‌

వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేలపై జనసేన వర్గాలు దాడి చేస్తాయని మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఖండించారు.  

Published : 24 Oct 2022 01:22 IST

అమరావతి: వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేలపై జనసేన వర్గాలు దాడి చేస్తాయని మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఖండించారు. జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైకాపా ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆయన్నారు. డీజీపీ కార్యాలయ వర్గాల నివేదిక ఆధారంగా మీడియా వార్తలు ఇస్తోందని, రహస్యంగా ఉంచాల్సిన నివేదిక ఎలా బయటకు వచ్చిందో డీజీపీ చెప్పాలన్నారు. రహస్య నివేదిక లీక్‌ కావడంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జనసేన నాయకుల ఫోన్లపైనే కాకుండా ఇలాంటి వ్యవహారాలపై నిఘా ఉంచాలని డీజీపీకి సూచించారు. విశాఖ ఘటన ప్రభుత్వమే కావాలని చేసిన కుట్ర అని ఆరోపించారు. టెక్కలిలో జనసేన కార్యాలయంపై వైకాపా దాడి చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులను వైకాపా సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని విమర్శించారు. వైకాపాతో ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని