Nadendla manohar: రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌: నాదెండ్ల మనోహర్‌

రైతుల దగ్గర లంచాలు తీసుకున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు.

Published : 03 Nov 2022 01:03 IST

తెనాలి: రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. రైతుల దగ్గర లంచాలు తీసుకున్న ప్రభుత్వం వైకాపానేనని ధ్వజమెత్తారు. ఈ క్రాప్‌ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులు ఆర్బీకేల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, తూకాల్లో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 10,700 ఆర్బీకేల్లో అవినీతి జరుగుతున్నట్టు విజిలెన్స్‌ నివేదిక వెల్లడించిందన్నారు. జగన్‌ సీఎం అయ్యాకే రైతులను కూడా కులాల వారీగా గుర్తిస్తున్నారని విమర్శించారు. గంజాయి కేసుల్లో పెద్ద తలకాయల్ని వదిలేసి చిన్నవాళ్లను మాత్రమే అరెస్టు చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న డీజీపీ గంజాయి నిర్మూలన చేస్తున్నందుకే తొలగించారని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు