Nadendla manohar: పాదయాత్రలు చేసి .. ముద్దులు పెట్టే పార్టీ కాదు మాది: నాదెండ్ల
జనసేన పార్టీ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనవరి 12న రణస్థలంలో యువశక్తి కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు.
శ్రీకాకుళం: పాదయాత్రలు చేసి.. ముద్దులు పెట్టే పార్టీ మాది కాదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువత కోసం జనవరి 12న రణస్థలంలో నిర్వహించనున్న యువశక్తి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను శ్రీకాకుళంలో నాదెండ్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ... జనసేన పార్టీ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లా యువత వలసలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేయడం వల్ల నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రచారం కోసం సిద్ధం చేసిన వారాహి వాహనంపై వైకాపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో పారదర్శకంగా ఉంటామని, ప్రజాక్షేత్రంలో పోరాడుతామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Netherlands: నెదర్లాండ్స్‌లో కాల్పుల కలకలం.. తొలుత ఓ ఇంటిపై.. ఆతర్వాత ఆసుపత్రిలో
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Amaravati: కాగ్ నివేదికలు వైకాపా అసమర్థ పాలనకు నిదర్శనం: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
-
Kharge: మహిళా రిజర్వేషన్ల బిల్లు.. అది భాజపా గారడీనే: ఖర్గే
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!