Janasena: రోడ్లు వేయలేని వాళ్లా రాజధాని కట్టేది?: నాదెండ్ల మనోహర్‌

ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలకు రోడ్లు నిర్మించాలంటే దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని.. అయితే జగన్‌ ప్రభుత్వం కేవలం రూ.26.50 కోట్లు మాత్రమే కేటాయించిందని జనసేన

Published : 09 May 2022 16:02 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలకు రోడ్లు నిర్మించాలంటే దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని.. అయితే జగన్‌ ప్రభుత్వం కేవలం రూ.26.50 కోట్లు మాత్రమే కేటాయించిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.100 కోట్లు అవసరమైతే ప్రభుత్వం కేవలం రూ.9 కోట్లే కేటాయించిందన్నారు. ప్రభుత్వం చేస్తోన్న కేటాయింపులు వైకాపా నేతల కమీషన్లకే సరిపోవడం లేదని విమర్శించారు. రోడ్లు వేయలేని వాళ్లా రాజధాని కట్టేది? అని నాదెండ్ల ప్రశ్నించారు.

‘‘రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆడబిడ్డలపై వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే.. తల్లుల పెంపకమే తప్పని చెప్పి మంత్రులు తప్పించుకుంటున్నారు. ఇది కచ్చితంగా పాలకుల వైఫల్యమే. వైకాపా ప్రభుత్వం చేసిన దిశ చట్టం ఎటుపోయింది? మహిళలకు రక్షణ కల్పించాలని నిరసనలు తెలిపితే కేసులు పెడుతున్నారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే అడ్డుకోవడం భావ్యం కాదు. పోలీసులు అనుసరించిన వైఖరి అప్రజాస్వామికంగా ఉంది’’ అని నాదెండ్ల ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని