Janasena: చిరంజీవి ఆకాంక్షను నెరవేరుస్తాం: నాగబాబు

భవిష్యత్‌లో తన మద్దతు తమ్ముడు,జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఉంటుందని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. పవన్‌ పగ్గాలు చేపట్టడమే చిరంజీవి ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

Updated : 05 Oct 2022 06:51 IST

మంగళగిరి: ‘‘ మేమిద్దరం చెరోవైపు ఉండటం కంటే తాను తప్పుకోవడమే తన తమ్ముడు రాజకీయాల్లో రాణించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే రాజకీయాల నుంచి తప్పుకున్నాను’’ అని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన మాట కోట్లాది మంది తమ్ముళ్ల మనసులను గెలుచుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు పగ్గాలు చేపట్టాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని ఆయన అన్నారు. తప్పకుండా అది నెరవేరుతుందని, జనసైనికులుగా తామంతా ఈ కార్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తామని నాగబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ నిజాయతీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, చిరంజీవి చెప్పిన మాటలు జన సైనికులకు, వీర మహిళలకు ఎంతో మనోధైర్యాన్నిచ్చాయని చెప్పారు. భవిష్యత్‌లో తాను ఏ పక్షాన ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి చెప్పిన మాటలకు అనుగుణంగా జనసైనికులంతా మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని నాగబాబు కోరారు. చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ..భవిష్యత్‌లో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని