Janasena Formation Day: రాజధాని లేకుండా పాలించిన ఘనత జగన్‌దే: నాగబాబు

అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎంకే జగన్‌కే దక్కుతుందని జనసేన నాయకులు నాగబాబు అన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలని...

Published : 15 Mar 2022 01:49 IST

అమరావతి: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎంకే జగన్‌కే దక్కుతుందని జనసేన నాయకులు నాగబాబు అన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు అకుంఠిత దీక్షతో పోరాటం చేశారని, కోర్టు తీర్పును జగన్‌ శిరసా వహించాలని సూచించారు. రాజధానిపై పై కోర్టులకు వెళ్లడం మానుకోవాలని సూచించారు. లేదంటే ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా పాలించిన ఘనత వహించిన వారవుతారని చెప్పారు. ఈ మేరకు ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే సగానికి పైగా ప్రజలు కాందశీకుల్లా పక్క రాష్ట్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని నాగబాబు అన్నారు. జగన్‌ పాలనలో సీఎం, ఆయన సలహాదారులు తప్ప ఎవరైనా బాగున్నారా? అని ప్రశ్నించారు. మంత్రులు సైతం అసహనంగా ఉన్నారని చెప్పారు. చేయడానికి పనిలేక కొందరు మంత్రులు ఫోన్లలో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారని ఎద్దేవాచేశారు. తనకు సోదరుడే అయినప్పటికీ.. పార్టీ పరంగా పవనే తన నాయకుడని చెప్పారు. పవన్‌ ఆశయాల కోసం ఓ జనసైనికుడిగా తనవంతు కృషి చేస్తానని చెప్పారు.


అమరావతిని నాశనం చేశారు..: నాదెండ్ల మనోహర్‌
పార్టీ స్థాపించిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఎన్నో అవమానాలకు గురయ్యారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పవన్‌ను ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ఎస్సీ కుటుంబం నుంచి వచ్చి దామోదరం సంజీవయ్య ఎంతో ఎత్తుకు ఎదిగారని, కానీ ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేసిన అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం కోసమే ఈ సభకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. అమరావతి నాశనానికి జగన్‌ పూనుకున్నారని నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఒకప్పుడు రూ.8 కోట్లు పలికిన భూముల ధర ఇప్పుడు రూ.3కోట్లకు చేరిందన్నారు. సంక్షేమం పేరుతో విలువల్లేని రాజకీయాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని