Kurnool MP: ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ నాగరాజు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు.

Published : 13 Jun 2024 19:49 IST

కర్నూలు: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈవో నర్సారెడ్డికి అందజేశారు. నాగరాజు 2021లో కర్నూలు మండలం పంచలింగాల గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా తరఫున  ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి రామయ్యపై 1,11,298 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీ కావడంతో ఎంపీటీసీ పదవికి నాగరాజు రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని