YS Sharmila: వైఎస్‌ షర్మిలకు బెయిల్‌ మంజూరు

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు బెయిల్‌ మంజూరైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.

Updated : 25 Apr 2023 16:49 IST

హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు బెయిల్‌ మంజూరైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. రూ.30వేల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను సమర్పించాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి తీసుకోవాలని షర్మిలకు న్యాయస్థానం షరతు విధించింది.

సోమవారం విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేయిచేసుకోవడం వివాదానికి దారితీసింది. ఒక మహిళా కానిస్టేబుల్‌ చెంపపై కొట్టడంతో పాటు ఒక ఎస్సైని ఆమె వెనక్కి నెట్టారు. పోలీసులు నిలువరిస్తున్నా ఆగకుండా వాహనాన్ని ఆమె డ్రైవర్‌ ముందుకు పోనివ్వడంతో ఒక కానిస్టేబుల్‌ కాలిపైకి టైరు ఎక్కింది. బంజారాహిల్స్‌ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. తాజాగా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. షర్మిలకు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని