Nara Bhuvaneswari: ఇప్పటి వరకు ఏ ఆధారాలూ చూపించలేకపోయారు: నారా భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

Updated : 27 Sep 2023 16:22 IST

సీతానగరం: తెదేపా అధినేత చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించారు. 

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్బంధించారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారు.. ఏ ఆధారాలూ చూపించలేకపోయారు. ప్రజల మనిషిని జైల్లో నిర్బంధించారు. శాంతియుత నిరసనలనూ పోలీసులు అడ్డుకుంటున్నారు. లోకేశ్ పాదయాత్రను కూడా పలుమార్లు అడ్డుకున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందిన యువత రూ.లక్షలు సంపాదిస్తున్నారు. చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దాం’’ అని భువనేశ్వరి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని