Chandrababu Arrest: ఏపీలో ప్రజాస్వామ్యానికి ప్రమాదఘంటికలు: నారా బ్రాహ్మణి

ఏపీ వర్సెస్‌ జగన్‌గా ఉన్న రాష్ట్రంలో.. ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబు వైపే ఉన్నారని నారా బ్రాహ్మణి అన్నారు.

Published : 26 Sep 2023 18:33 IST

రాజమహేంద్రవరం: ఏపీ వర్సెస్‌ జగన్‌గా ఉన్న రాష్ట్రంలో.. ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబు వైపే ఉన్నారని నారా బ్రాహ్మణి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. శాంతియుత ర్యాలీల్లో మహిళలపై వేధింపులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. ‘‘ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే అంగన్వాడీలు కోరుతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న వారిపై దురుసు ప్రవర్తనా?’’ అని బ్రాహ్మణి మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని