Nara Brahmani: ప్రజాస్వామ్యాన్ని వైకాపా అపహాస్యం చేస్తోంది: నారా బ్రాహ్మణి

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం వైకాపాకు తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.

Published : 18 Sep 2023 09:09 IST

అమరావతి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం వైకాపాకు తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.

‘‘ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలను వైకాపా అపహాస్యం చేస్తోంది. పాలనలో వైకాపా నేతలు అసమర్థులు. సీమెన్స్‌ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారు. వైకాపా నేతలు మాత్రం కళ్లు ఉండి కూడా వాటిని చూడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు వెంట ఉన్నారు’’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు