TDP: మన్నవ మోహనకృష్ణకు నారా లోకేశ్‌ ప్రశంసలు

తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ మన్నవ మోహన కృష్ణను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు.

Published : 26 May 2023 17:54 IST

కర్నూలు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌  చేపట్టిన యువగళం పాదయాత్రలో ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన పాదయాత్రలో లోకేశ్‌తోపాటు నడిచారు. యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ యాత్ర వల్ల రైతుల్లో నమ్మకం, యువతలో భరోసా, నిరుపేదల్లో ధైర్యం వచ్చిందని, యువగళం పాదయాత్ర ముందుకు సాగే కొద్దీ అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఈ సందర్భంగా నారా లోకేశ్‌తో మన్నవ మోహన కృష్ణ అన్నారు. యువగళం దెబ్బకి వైకాపా తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను, చేస్తున్న పార్టీ కార్యక్రమాలను నారాలోకేశ్‌కు మోహనకృష్ణ వివరించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటున్న మోహన కృష్ణని నారా లోకేశ్ అభినందించారు. అలాగే ‘మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఆయన చేస్తున్న సేవలను, పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. మన్నవ మోహన కృష్ణ గతంలో నాట్స్‌ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అధ్యక్షుడిగా సేవలందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు