Nara Lokesh: శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా?ఒప్పుకొంటారా?: జగన్‌కు లోకేశ్‌ సవాల్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

Updated : 27 Sep 2022 13:46 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరోసారి స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమల వెళ్తున్న సీఎం జగన్‌.. ఈ విషయంపై అక్కడ ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈమేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

‘‘వివేకా హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్‌ హత్యతో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సిద్ధమా? ప్రమాణం చేయకపోతే గొడ్డలి పోటు జగనాసుర రక్తచరిత్ర అని ఒప్పుకొంటారా?’’ అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని