Nara Lokesh: ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను ఆకర్షిస్తాం: మంత్రి నారా లోకేశ్‌

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

Updated : 14 Jun 2024 18:06 IST

అమరావతి: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. మంత్రులకు శాఖల కేటాయింపు తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల కల్పనకు ఇతర రాష్ట్రాలతో తీవ్రంగా పోటీ పడతామన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌ కంపెనీలను ఆకర్షిస్తామని తెలిపారు. వలస వెళ్లిన యువతకు స్థానికంగానే ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామన్నారు. పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. గ్రామీణ విద్యావ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడం పవిత్రమైన బాధ్యత అన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో మరింత మెరుగ్గా పనిచేస్తానని లోకేశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని