Nara Lokesh: ఏపీ రాజధాని ఏదంటే దావోస్‌లో జగన్‌ ఏం చెప్తారు?: లోకేశ్‌

 ఏపీ రాజధాని ఏదంటే దావోస్‌లో సీఎం జగన్‌ ఏం సమాధానం చెబుతారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి 

Updated : 23 May 2022 13:10 IST

విజయవాడ: ఏపీ రాజధాని ఏదంటే దావోస్‌లో సీఎం జగన్‌ ఏం సమాధానం చెబుతారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. పీపీఏలను రాష్ట్రంలో ఎందుకు రద్దు చేశారని వరల్డ్ ఎకనమిక్‌ ఫోరంలో అడిగితే సీఎం ఏమని వివరణ ఇస్తారని నిలదీశారు. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనపై నమోదైన కేసులో లోకేశ్‌ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘దావోస్‌లో వైకాపా నేతల మీటింగ్‌ జరుగుతున్నట్టే ఉంది తప్ప పెట్టుబడుల కోసం జగన్‌ అక్కడికి వెళ్లినట్లు లేదు. దావోస్‌లో పారిశ్రామిక వేత్తలు ఎవరూ జగన్‌ను కలవడానికి రావడం లేదు. గత 24 గంటల్లో ఆయన కలిసిన ఏకైక పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీయే. అదానీని కలిసేందుకు దావోస్‌ వెళ్లడం దేనికి? దిల్లీ వెళ్లినా ఆయన కలుస్తారు. ప్రత్యేక విమానం కోసమే జగన్‌ రూ.8కోట్లు ఖర్చు చేశారు. దావోస్‌కు నేరుగా వెళ్లకుండా లండన్‌ ఎందుకు వెళ్లారు?’’ అని లోకేశ్‌ నిలదీశారు. 

ఏపీలో పోలీస్‌రాజ్యం నడుస్తోందని లోకేశ్‌ విమర్శించారు. ఏ చిన్న కామెంట్‌ చేసినా.. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టినా వెంటనే కేసులు పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేసి తిరుగుతున్నా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు పెట్టడానికి తాత్సారం చేస్తు్న్నారని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు తన కేసులను వెంటనే పరిష్కరించాలని కోర్టును జగన్‌ అడగొచ్చు కదా అని ప్రశ్నించారు. తన కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని జగన్ అడగగలరా అని లోకేశ్ నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని