Nara lokesh: జగన్‌వి.. పదో తరగతి పాస్‌.. డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు: నారా లోకేశ్‌

‘అందరికీ ఆరోగ్యమస్తు - ఇంటికి శుభమస్తు’ నినాదంతో సొంత ఖర్చుతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య కేంద్రాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రారంభించారు...

Published : 17 Aug 2022 01:48 IST

అమరావతి: ‘అందరికీ ఆరోగ్యమస్తు - ఇంటికి శుభమస్తు’ నినాదంతో సొంత ఖర్చుతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య కేంద్రాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్య సంజీవని పేరుతో నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఇందుకు అవసరమైన  వైద్యులు, సిబ్బంది, చికిత్స పరికరాలను లోకేశ్‌ సమకూర్చారు. ఇక్కడ దాదాపు 200కుపైగా రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వి పదో తరగతి పాస్‌.. డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు. వైకాపా హయాంలో రాష్ట్రానికి వచ్చిన వాటి కంటే బయటకు వెళ్లిన పరిశ్రమలే ఎక్కువ. పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎంకు వాటా ఎంత అనే చర్చ వస్తుంది. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే నేను చర్చకు సిద్ధం. ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి సీఎం జగన్‌ దిల్లీలో తలవంచారు. సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతా’’ అని లోకేశ్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని