Nara Lokesh: జగన్‌.. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి?రాష్ట్రం నీ తాత జాగీరా!: మంత్రి నారా లోకేశ్‌ ఫైర్‌

వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూకేటాయింపులపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ చేశారు.

Updated : 23 Jun 2024 13:47 IST

అమరావతి: వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూకేటాయింపులపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ చేశారు.

అనుమతుల్లేకుండానే ఊరూరా వైకాపా ప్యాలెస్‌లు..!

‘‘జగన్‌.. ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైకాపా కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూకేటాయింపులు చేశారు. రూ.1000 నామమాత్రపు లీజుతో 42 ఎకరాలకు పైగా కేటాయించారు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 42 ఎకరాల్లో.. 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చు. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని