Nara Lokesh: మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఫేకో.. రియలో ప్రజలే తేలుస్తారు: నారా లోకేశ్‌

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఫేకో.. రియలో ప్రజలే తేలుస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఫేక్‌ వీడియో అయితే..

Updated : 10 Aug 2022 19:06 IST

అమరావతి: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఫేకో.. రియలో ప్రజలే తేలుస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఫేక్‌ వీడియో అయితే.. నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎలా అంటారని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల వాయిస్‌  కూడా ఫేక్‌ అని తేల్చేశారా? అని నిలదీశారు. మాధవ్‌ వీడియోపై అనంతపురం ఎస్పీ వివరణను తప్పుపట్టిన లోకేశ్‌.. ఆయనేమైనా ఫోరెన్సిక్‌ నిపుణుడా అని నిలదీశారు. వీడియో ఒరిజినల్‌ కాదని చెప్పే ఫోరెన్సిక్‌ నివేదిక ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. మహిళలను కించపర్చే విధంగా వైకాపా నేతలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాధవ్‌ గురించి ఎస్పీకి బాగా తెలుసునకుంటా అని విమర్శించారు. ఇద్దరూ పోలీసులే కదా అని ఎద్దేవా చేశారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయటం ఎంత అనివార్యమో.. మంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీ చేయటం కూడా అంతే అనివార్యమన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని