Andhra News: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం: నారా లోకేశ్‌

పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే విషయంపై...

Updated : 22 Mar 2022 05:51 IST

అమరావతి: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే విషయంపై క్లారిటీ ఇప్పటికీ లేదన్నారు. మమత బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసస్ ప్రస్తావన ఎక్కడా రాలేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు వివరించినట్లు తెలిపారు. ఐదు రోజులుగా మద్యం, కల్తీ సారా మరణాలపై తాము పోరాడుతున్నామని.. సారా మరణాలను సహజ మరణాలుగా సీఎం తీసిపారేయడం బాధాకరమని దుయ్యబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారా వల్ల మొత్తంగా 42 మంది చనిపోయారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు మనుషులు తాగడానికి ఏమాత్రం పనికిరావన్ని పేర్కొన్నారు. కల్తీ సారా, కల్తీ మద్యంతో ఈ ప్రభుత్వం పేదలను చంపేస్తోందని.. ఇందుకే జగన్‌మోహన్‌రెడ్డిని.. జగన్ మోసపు రెడ్డి అని పిలుస్తున్నామని లోకేశ్‌ చురకలంటించారు.

‘‘మమతా బెనర్జీ స్టేట్‌మెంట్‌ ఇచ్చారంటూ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌పై అసెంబ్లీలో చర్చకు పెట్టారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ స్వయంగా ఆర్టీఐ ద్వారా సమాధానం ఇచ్చారు. వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ అమ్మలేదని ఇజ్రాయెల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా సభలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌పై స్వల్పకాలిక చర్చకు మండలి ఛైర్మన్ అనుమతించారు. మేము మద్యం మరణాలపై చర్చ పెట్టాలని ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే.. అందుకు ఛైర్మన్ అనుమతించలేదు. మేం ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారు. భవిష్యత్తులో వైకాపాకు 15 మంది కూడా ఉండని పరిస్థితి వస్తుంది’’ అని లోకేశ్‌ హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని