Andhra News: మద్యంలో రసాయనాలు.. మా వద్ద ల్యాబ్‌ రిపోర్టులున్నాయి: లోకేశ్‌

నాటుసారా మరణాలపై నిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంలో

Updated : 22 Mar 2022 18:34 IST

అమరావతి: నాటుసారా మరణాలపై నిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంలో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు తమ దగ్గర ఉన్నాయన్నారు. కొన్ని రసాయనాలు సైనేడ్‌గా మారొచ్చనే అధ్యయనాలు ఉన్నాయన్నారు. వాస్తవాలు బయటపడతాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చర్చ నుంచి పారిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల నుంచి తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించమని కోరితే.. స్పీకర్ మార్షల్స్‌ని రమ్మంటున్నారని ఎద్దేవా చేసారు. మంత్రులు బొత్స, కొడాలి నాని తరహాలో తెదేపా సభ్యులెవరూ ప్రవర్తించట్లేదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని