Nara Lokesh: ఆ మానవ మృగాలకు శిక్ష పడుంటే భయం పుట్టేది: లోకేశ్‌

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated : 28 Apr 2022 12:14 IST

అమరావతి: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారని ఆరోపించారు. దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళపై అఘాయిత్యం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇవ్వడం, కేసులు నమోదు చేయడం తాలిబన్ల పాలనని తలపిస్తోందన్నారు. అత్యాచారాలు, హత్యలతో బరితెగించిన నిందితులను ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తోందని లోకేశ్‌ మండిపడ్డారు. అందువల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారని ఆక్షేపించారు. వైకాపా పాలనలో ఇప్పటి వరకు 800 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. వీటికి పాల్పడిన మానవ మృగాళ్లలో ఒక్కరికైనా శిక్ష పడి ఉంటే వారికి భయం పుట్టేదని లోకేశ్ ఓ ప్రకటనలో అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని