Published : 10 May 2022 02:14 IST

Nara Lokesh: పులివెందులలోనే ఇంత దారుణమైన పరిస్థితా?: నారా లోకేశ్‌

అమరావతి: ఇసుక, మద్యం కాదేదీ అవినీతికి అనర్హం అంటూ వైకాపా నేతలు దోచేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. పులివెందులలో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధులను వైకాపా నేత వైఎస్‌ కొండారెడ్డి బెదిరించారని.. ఆ సంస్థ ప్రతినిధుల నుంచి డబ్బు గుంజబోయారన్నారు. సీఎం జగన్‌ సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమైన పరిస్థితా? అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు చేయని దందాలు ఎన్ని జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రజలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లని పీడిస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

ఎవరీ కొండారెడ్డి?

పులివెందుల నియోజకవర్గం పరిధిలోని చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డి. సీఎం జగన్‌కు ఆయన బంధువు. పులివెందుల- రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ సంస్థ కాంట్రాక్టర్‌ను కొండారెడ్డి బెదిరించినట్లు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. తమ మండలంలో పనులు చేయాలంటే డబ్బులివ్వాలని కొండారెడ్డి డిమాండ్‌ చేసినట్లు కాంట్రాక్టర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్ణాటకలోని ఓ భాజపా నేతకు చెందిన ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ సంస్థ.. కొండారెడ్డి బెదిరిస్తున్న విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.  దీన్ని తీవ్రంగా పరిగణించిన జగన్‌.. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని