Nara Lokesh: చంద్రబాబును జైల్లోనే చంపేందుకు కుట్ర: నారా లోకేశ్

రాజమహేంద్రవరం జైల్లో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. 

Updated : 21 Sep 2023 13:23 IST

అమరావతి: రాజమహేంద్రవరం జైల్లో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

‘‘మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోంది. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించారు. చంద్రబాబునూ ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్‌దే బాధ్యత’’ అని లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని