Nara Lokesh: భారీ మెజార్టీతో నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్‌’లో లోకేశ్‌

మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్‌ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు.

Updated : 15 Jun 2024 12:44 IST

అమరావతి: మంగళగిరి ప్రజల కోసం ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

నారా లోకేశ్‌ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

తెదేపా పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు అధినేత చంద్రబాబు నేడు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ కార్యాలయానికి రానున్నారు. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ కార్యాలయ వర్గాలు భారీగా ఏర్పాట్లు చేశాయి. ఇకపై తరచూ పార్టీ కార్యలయానికి వెళ్లేలా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ చేశారు. పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని