Nara Lokesh: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేశ్‌ పేరు

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేరును సీఐడీ చేర్చింది. ఈ మేరకు కేసులో ఆయన పేరును చేరుస్తూ నేడు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.

Updated : 26 Sep 2023 13:28 IST


విజయవాడ: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేరును సీఐడీ చేర్చింది. ఈ మేరకు కేసులో ఆయన పేరును చేరుస్తూ నేడు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.

ఈ కేసులో లోకేశ్‌ పేరును చేర్చేందుకు ఉన్న ఆధారాలేంటి? ఏ కోణంలో చేర్చారు? తదితర విషయాలను సీఐడీ వెల్లడించాల్సి ఉంది. సీఐడీ మెమోపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇదే కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను సీఐడీ చేర్చింది. నారాయణ ముందస్తు బెయిల్‌ పొందారు. ఈ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని