Andhra News: ఆ విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకూడదు: సీఎం జగన్‌కు లోకేశ్‌ లేఖ

ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న విద్యార్థులు రాష్ట్రానికి చేరుకున్న విషయం...

Published : 16 Mar 2022 19:12 IST

అమరావతి: ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న విద్యార్థులు రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. వారిలో కొందరికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభం కాగా.. వారు చదివే వర్సిటీల నుంచి ఎలాంటి సమాచారం లేక మరికొందరు అయోమయంలో ఉన్నారన్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోర్సుల పూర్తికి చర్యలు తీసుకుంటామని, చదువుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని ప్రకటించాయన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆ విద్యార్థుల చదువు పూర్తయ్యే బాధ్యతను తీసుకోవాలని లేఖలో కోరారు.

తిరిగి ఉక్రెయిన్‌ వెళ్లకుండా ఇక్కడే చ‌దువు కొన‌సాగించాల‌నుకుంటున్న విద్యార్థుల ఫీజులని ప్రభుత్వమే కట్టాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన‌ విద్యార్థుల‌ను ఆయా కోర్సుల్లో చేర్చుకునేందుకు అంగీకారం తెలిపిన క‌ళాశాల‌లు, యూనివ‌ర్సిటీల‌తో ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదింపులు జ‌ర‌పాల‌న్నారు. మన రాష్ట్రం నుంచి వీరంతా విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లడానికి గ‌ల కార‌ణాలు తెలుసుకునేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని