Nara Lokesh: జగన్‌.. ఏమిటీ ప్యాలెస్‌ల పిచ్చి?.. మంత్రి నారా లోకేశ్‌ ధ్వజం

‘ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి? మీ ధనదాహానికి అంతులేదా?’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విద్యాశాఖ మంత్రి, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. వైకాపా కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలను 33 ఏళ్లకు రూ.వెయ్యి చొప్పున నామమాత్రపు లీజుకి కేటాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 24 Jun 2024 04:22 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి? మీ ధనదాహానికి అంతులేదా?’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విద్యాశాఖ మంత్రి, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. వైకాపా కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలను 33 ఏళ్లకు రూ.వెయ్యి చొప్పున నామమాత్రపు లీజుకి కేటాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జనం నుంచి దోచుకున్న రూ. 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నారు. మీరు ఆక్రమించుకున్న రూ.600 కోట్ల విలువైన 42 ఎకరాల్లో 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. మీ ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చు’’ అని ఎక్స్‌ వేదికగా ఆదివారం విమర్శలు గుప్పించారు. ‘అనుమతుల్లేకుండానే..ఊరూరా వైకాపా ప్యాలెస్‌లు’ పేరుతో ఈనాడులో వచ్చిన కథనంలోని అంశాలు, జిల్లాల వారీ వైకాపా కార్యాలయాల ఫొటోల్ని పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని