Nara Lokesh: శ్రీవరదరాజస్వామి ఆలయంలో లోకేశ్‌ ప్రత్యేకపూజలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ (Yuvagalam)పాదయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 27 Jan 2023 11:37 IST

కుప్పం పట్టణం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ (Yuvagalam)పాదయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న యువనేతకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లోకేశ్‌ రాకతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇప్పటికే కుప్పం చేరుకున్నారు. 

అనేక దఫాలు చంద్రబాబు కుప్పం పర్యటనలు, నామినేషన్లు, ర్యాలీలకు సంబంధించి వరదరాజస్వామి సన్నిధిలో పూజల తర్వాతే కార్యక్రమాలను ప్రారంభించడాన్ని ఆనవాయితీగా చేపట్టారు. గతంలో పలుమార్లు కుప్పంలో పర్యటించిన లోకేశ్‌... ఎన్నికల ప్రచారాలు, గ్రామ పర్యటనలనూ లక్ష్మీపురంలో పూజలతోనే ప్రారంభించారు. ఆ సెంటిమెంటుతో అదే ఆలయం నుంచి ‘యువగళం’ పాదయాత్రకుకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని