Nara Lokesh: వైకాపా ఇసుక మాఫియాకు ఇదే ప్రత్యక్షసాక్ష్యం: నారా లోకేశ్‌ సెల్ఫీ

ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి దోపిడీకే ప్రాధాన్యమిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 10 Jun 2023 12:57 IST

రాజంపేట: ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి దోపిడీకే ప్రాధాన్యమిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్ర 122వ రోజు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని జంగాలపల్లె విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో సిద్దవటం మండలం జంగాలపల్లెకు చేరుకున్న లోకేశ్‌.. పెన్నానదిని తోడేసి వైకాపా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి అనధికారికంగా పోగేసిన ఇసుక డంపింగ్ యార్డుతో సెల్ఫీ దిగారు. 

లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘పెన్నానది పక్కనే ఉన్నా స్థానిక ప్రజలకు మాత్రం ఇసుక అందుబాటులో ఉండటం లేదు. బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకు ఇక్కడి ఇసుకను తరలించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నా ఎస్ఈబీ అధికారులకు కనపడదు. జగన్ రెడ్డి పాపాలపుట్ట మాదిరి పెరిగిపోతున్న ఈ ఇసుక మేట రాష్ట్రంలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాకు ప్రత్యక్షసాక్ష్యం’’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి లోకేశ్‌తో భేటీ అయ్యారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరులో యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై లోకేశ్‌తో చర్చించారు. మేకపాటితో పాటు బద్వేల్‌కు చెందిన తెదేపా నేతలు కూడా లోకేశ్‌ను కలిశారు. ఈనెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు