Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి

ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మరోసారి నోరు జారి భంగపడ్డారు.

Published : 30 May 2023 22:45 IST

తిరుపతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మరోసారి నోరు జారి భంగపడ్డారు. ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మాట్లాడిన నారాయణస్వామి వెంటనే తేరుకుని సారీ సీఎం కాదు.. మంత్రి పెద్ది రెడ్డి అంటూ సవరించుకున్నారు. ‘‘నన్ను ఏ సమావేశానికి పిలిచినా అక్కడ ఎక్కువగా అగ్రవర్ణాల వారే ఉంటారు. మా పార్టీలో రెడ్లే ఎక్కువగా ఉన్నారు. నేను ఎప్పుడు ఏమి మాట్లాడినా మా పార్టీలోని వారే నన్ను చులకనగా చూస్తారు. మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనంపై నేను మాట్లాడితే కొంతమందికి కోపం వస్తుంది. నేను అవేమీ పట్టించుకోను.. నా పంథా నాదే’’ అని తనదైన శైలిలో నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని