JP Nadda: పేదలకు కావాల్సింది డబ్బు కాదు.. సాధికారత: జేపీ నడ్డా

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత.. ఈ 70 ఏళ్లలో ప్రజలకు కాంగ్రెస్‌పార్టీ చేసిందేమీ లేదని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు స్వావలంబన చేకూరేలా చేస్తోందని చెప్పారు. దిల్లీ సమీపంలోని ఓ పట్టణంలో నిర్వహించిన ‘సార్తక్‌ చౌపాల్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భాజపా ప్రభుత్వం

Published : 18 Nov 2021 01:58 IST

దిల్లీ: భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఈ 70 ఏళ్లలో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు స్వావలంబన చేకూరేలా చేస్తోందని చెప్పారు. దిల్లీ సమీపంలోని ఓ పట్టణంలో నిర్వహించిన ‘సార్తక్‌ చౌపాల్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భాజపా ప్రభుత్వం ఉజ్వల యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో ప్రజలను సాధికారత వైపు నడిపిస్తోందని తెలిపారు. 

‘‘గత 70 ఏళ్లలో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది? ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం మానేసి.. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చేది. ప్రజలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎలాంటి సహాయం చేయలేదు. ప్రజలకు కావాల్సింది డబ్బు కాదు.. సాధికారత. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక.. 10 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి. ఆయుష్మాన్‌ యోజన ద్వారా 55 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. 8 కోట్ల కుటుంబాలకు గ్యాస్‌ సిలిండర్లు అందాయి. మారుతున్న భారత దేశానికి ఇదొక నిదర్శనం’’అని నడ్డా అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని