NCP: మోదీ ఎనిమిదేళ్ల పాలనా వైఫల్యాలివే.. జాబితా సిద్ధం చేసిన ఎన్‌సీపీ

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలన.. వరుస వైఫల్యాలతో గుర్తింపు పొందిందని శరద్‌పవార్‌కు చెందిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) గురువారం ఎద్దేవా చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగిత రేటు, అదుపులేని...

Published : 27 May 2022 01:59 IST

ముంబయి: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలన.. వరుస వైఫల్యాలతో గుర్తింపు పొందిందని శరద్‌పవార్‌కు చెందిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) గురువారం ఎద్దేవా చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగిత రేటు, అదుపులేని ద్వేషపూరిత రాజకీయాలు.. ప్రధాన వైఫల్యాలుగా పేర్కొంది. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మే 26తో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. అయితే, భాజపా పాలనలో దేశం చాలా నష్టపోయిందని ఎన్‌సీపీ ముఖ్య అధికార ప్రతినిధి మహేశ్ తపసే విమర్శలు చేశారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగిత రేటు, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం, జాతీయ భద్రతను కాపాడటంలో విఫలం, ద్వేషపూరిత రాజకీయాలు, చారిత్రక స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం, ఆర్థిక పతనం, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడం.. ఈ ఎనిమిందింటిని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలుగా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘మోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం చాలా నష్టపోయింది. ఆర్‌ఎస్ఎస్‌ భావజాలం దేశంలోని మత సామరస్యాన్ని నాశనం చేసింది. సైన్స్, సమానత్వాన్ని.. మతం, జాతి శాసిస్తున్నాయి’ అని తపసే ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని