Maharashtra: సీఎం ఏక్‌నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
ఎన్సీపీ(NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde)ను ముంబయిలోని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. ఉద్ధవ్ ఠాక్రే విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde )తో ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (Sharad Pawar) భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, పవార్ మాత్రం ఇది పూర్తిగా తన వ్యక్తిగతమైన భేటీయేనంటూ క్లారిటీ ఇచ్చారు. ‘‘దక్షిణ ముంబయిలోని ప్రఖ్యాత మరాఠా మందిర్ (Maratha Mandir) సినిమా హాలు 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సీఎం ఏక్‌నాథ్ శిందేను ఆహ్వానించేందుకు ఆయన అధికారిక నివాసం వర్షలో కలిశాను’’ అని ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో మరాఠా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించినట్టు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే సైతం ఇదే విషయాన్ని పేర్కొంటూ ట్వీట్ చేశారు.మరోవైపు, శిందే, పవార్ సమావేశంపై భాజపా కూడా స్పందించింది. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని.. దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదంటూ ఆ పార్టీ నేత, మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. ఒకవేళ ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఉంటే దాన్ని తప్పకుండా స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ భేటీ జరగడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
IND vs AUS: ఆసీస్‌పై భారత్ విజయం.. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యం
-
Mainampally: భారాసకు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం