Mallikarjun Kharge: ఎన్డీయే మైనార్టీ సర్కార్... అయితే కొనసాగాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు

Mallikarjun Kharge: కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. ఆ సర్కారుకు మెజార్టీ లేదన్నారు.

Published : 15 Jun 2024 12:38 IST

బెంగళూరు: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం (NDA Govt)పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు పొరపాటుగా ఏర్పాటైందని, ఏ క్షణమైనా కూలిపోతుందని జోస్యం చెప్పారు. 

‘‘మోదీ (PM Modi) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి సంఖ్యాబలం లేదు. ఇది మైనార్టీ ప్రభుత్వం. ఎన్డీయే సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చు. కానీ, ప్రభుత్వం కూలిపోవాలని మేం కోరుకోవట్లేదు. దేశానికి మంచి జరగాలి. అందుకోసం కలిసికట్టుగా పనిచేయాలనే మేం ఆశిస్తున్నాం. కానీ, ప్రధానికి మాత్రం మంచిని కొనసాగించే అలవాటు లేదు. ఏదేమైనప్పటికీ దేశాన్ని బలోపేతం చేయడం కోసం మేం పూర్తి సహకారం అందిస్తాం’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.

‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్‌కు దిల్లీ కోర్టు నోటీసులు

అయితే, కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఎన్డీయే మిత్రపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాలను గుర్తుచేస్తూ ఖర్గేపై విమర్శలు గుప్పించాయి. ‘‘మెజార్టీ రాకుండానే పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలను నడిపించలేదా? కాంగ్రెస్‌ చరిత్ర గురించి ఖర్గేకు గుర్తులేదా?’’ అని జేడీయూ నేత ఒకరు ఎద్దేవా చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమి 293 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. గత రెండు సార్లు సొంతంగా మెజార్టీ మార్క్‌ దాటిన భాజపా (BJP) ఈ సారి 240 సీట్లకు పరిమితమవడంతో కాంగ్రెస్‌ ఇలాంటి విమర్శలు గుప్పిస్తోంది. అయితే, 1991లో కాంగ్రెస్‌కు కూడా 244 స్థానాలు దక్కగా.. మిత్రపక్షాలతో కలిసి పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004లో కాంగ్రెస్‌ 114 స్థానాల్లో గెలుపొందగా.. మిత్రపక్షాల అండతో మన్మోహన్‌ ప్రధాని అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని