- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Mamata Banerjee: మన్‌కీ బాత్ వద్దు.. పెట్రోల్‌పై మాట్లాడండి..!
కోల్‌కతా: దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మన్‌కీ బాత్ స్థానంలో ప్రధాని పెట్రోల్, వ్యాక్సిన్‌కీ బాత్ నిర్వహించాలంటూ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన పన్నుల రూపంలో రూ.3.71 లక్షల కోట్లను ప్రజల నుంచి దోచుకుందంటూ కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. ఆ డబ్బును ఏం చేశారంటూ మోదీని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్‌పై కాకుండా ప్రజల ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘గ్యాస్ ధర 14 నెలల్లో 47 శాతం పెరిగింది. ఉజ్వల పథకం ఏమయ్యింది? మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు మీరెందుకు చేయడంలేదు?’’ అంటూ ప్రశ్నించారు. ధరల పెంపు ద్వారా సమీకరించిన నిధులను కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వినియోగించాలని కోరారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్కడ్ను కొనసాగించడంపైనా ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు.
దిల్లీ, కోల్‌కతా నగరాల్లో లీటరు పెట్రోలు ధర బుధవారం రూ.100 మార్కును దాటింది. లీటరు డీజిల్ రూ.89.53కు చేరింది. ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పెట్రోలు ధర ఇప్పటికే రూ.100 దాటింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Vaccine: ఆరు నెలల్లోపే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్..!
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
-
India News
Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: నీతీశ్
-
Sports News
Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!
-
Sports News
Sourav Ganguly: పాక్‌తో మ్యాచ్‌లను ఏనాడూ ప్రత్యేకంగా భావించలేదు: గంగూలీ
-
India News
Karnataka: సావర్కర్- టిప్పుసుల్తాన్ ఫ్లెక్సీల వివాదం.. శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్తత!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Crime News: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Karnataka: సావర్కర్- టిప్పుసుల్తాన్ ఫ్లెక్సీల వివాదం.. శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్తత!
- SBI: అమృతోత్సవాల వేళ.. ఎస్బీఐ సరికొత్త ‘ఉత్సవ్’ పథకం