TG News: 34 కార్పొరేషన్లకు కొత్త ఛైర్‌పర్సన్లు

రాష్ట్రంలోని 34 కార్పొరేషన్లకు కొత్తగా ఛైర్‌పర్సన్లను, ఒక సంస్థకు వైస్‌ ఛైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 09 Jul 2024 04:34 IST

ప్రభుత్వ ఉత్తర్వుల జారీ

రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా  సోమవారం బాధ్యతలు స్వీకరించిన
మల్‌రెడ్డి రాంరెడ్డిని అభినందిస్తున్న ఎంపీ చామల, మధుయాస్కీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 34 కార్పొరేషన్లకు కొత్తగా ఛైర్‌పర్సన్లను, ఒక సంస్థకు వైస్‌ ఛైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ ఉత్తర్వులు వెలువడినా.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఛైర్‌పర్సన్లు ఎవరూ బాధ్యతలు స్వీకరించలేదు.

నామినేటెడ్‌ పదవుల భర్తీపై ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా ప్రభుత్వం మరోసారి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ల జీవోను విడుదల చేయడంతో సోమవారం పలువురు బాధ్యతలు కూడా స్వీకరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని