CM Chandrababu: వారి సేవలు మరో రూపంలో వినియోగించుకుంటాం: చంద్రబాబు

తెలుగుదేశం సీనియర్‌ నేతలు, పలువురు మంత్రులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. 

Published : 14 Jun 2024 18:44 IST

వెలగపూడి: తెలుగుదేశం సీనియర్‌ నేతలు, పలువురు మంత్రులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. మంత్రి వర్గం కూర్పు చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు. మంత్రివర్గంలో చోటు దక్కని వారి సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్‌ సీఎంని కలిసి సంతోషం వ్యక్తం చేశారు. తనకు హోం శాఖ కేటాయించినందుకు అనిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంత్రులుగా సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు