Nimmala Rama Naidu: టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టిన ఘనత జగన్‌దే

తెదేపా హయాంలో 90% పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.7వేల కోట్లకు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత మాజీ సీఎం జగన్‌దేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Published : 08 Jul 2024 03:18 IST

పాలకొల్లులో మంత్రి నిమ్మల శ్రమదానం

టిడ్కో సముదాయంలో శ్రమదానం చేస్తున్న మంత్రి నిమ్మల 

పాలకొల్లు, న్యూస్‌టుడే: తెదేపా హయాంలో 90% పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.7వేల కోట్లకు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత మాజీ సీఎం జగన్‌దేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని టిడ్కో సముదాయంలో చిట్టడవిలా పెరిగిపోయిన పిచ్చిమొక్కలను తొలగించడానికి పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి ఆదివారం శ్రమదానం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ టిడ్కో ఇళ్లకు వైకాపా రంగులేసి లబ్ధిదారులను రుణగ్రస్తులను చేయడం మినహా పేదలకు జగన్‌ చేసిందేమీ లేదన్నారు. పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని