Nimmala Ramanaidu: జగన్‌ హయాంలో నీటి పారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి: మంత్రి నిమ్మల

వ్యవసాయం, రైతులను కాపాడుకోవడం తమ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Updated : 10 Jul 2024 15:00 IST

ఉండవల్లి: వ్యవసాయం, రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్‌ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం రెగ్యులేటర్‌ గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్‌ హయాంలో ఇరిగేషన్‌ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. పట్టిసీమను వట్టిసీమన్న జగన్‌.. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఒకే రోజు 4 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాలకు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. 

చింతలపూడి ప్రాజెక్టును వైకాపా నాయకులు నిర్లక్ష్యం చేశారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఐదేళ్లు పూడిక తీయకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో పులిచింతల ఎండిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 40 టీఎంసీలు ఉండాల్సిన చోట అర టీఎంసీ కూడా నీటి నిల్వ లేదని చెప్పారు. చివరి ఎకరాకు నీళ్లిచ్చే వరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని