Pegasus: పెగాసస్‌పై దర్యాప్తు జరపండి: నితీశ్‌

పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని విపక్ష పార్టీలు పట్టుపడుతుండగా.. వాటికి భాజపా మిత్రపక్షం జత కలిసింది. పెగాసస్‌పై అన్ని విషయాలు బయటపెట్టాలని తాజాగా జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ అన్నారు. ప్రజలను వేధించేందుకు ఇలాంటివి చేయకూడదని వ్యాఖ్యానించారు. 

Updated : 03 Aug 2021 04:16 IST

దిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని విపక్ష పార్టీలు పట్టుపడుతుండగా.. వాటికి భాజపా మిత్రపక్షం జత కలిసింది. పెగాసస్‌పై అన్ని విషయాలు బయటపెట్టాలని తాజాగా జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కోరారు. ప్రజలను వేధించేందుకు ఇలాంటివి చేయకూడదని వ్యాఖ్యానించారు. 

‘ఫోన్ల ట్యాపింగ్‌పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. దీన్ని పార్లమెంట్‌లో కూడా లేవనెత్తారు. మీడియాలో అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల్ని వేధించేందుకు ఇలాంటి పనులు చేయకూడదు. అందుకే ఈ అంశాన్ని కచ్చితంగా పరిశీలించాలి. అన్ని వివరాలు బహిర్గతం చేయాల్సి ఉంది’ అని మీడియా అడిగిన ప్రశ్నకు నితీశ్‌ బదులిచ్చారు. 

కొద్దిరోజులుగా పార్లమెంట్‌ పెగాసస్ వ్యవహారంతో దద్దరిల్లుతోంది. పెగాసస్‌పై దర్యాప్తునకు విపక్షాలు పట్టుపట్టడంతో ఉభయ సభల్లో తరచూ వాయిదా పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. దీనిపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వారంలో విచారణ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని