Updated : 09 Mar 2021 00:35 IST

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ గృహనిర్బంధం

హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పోలీసులు హైదరాబాద్‌లో  గృహనిర్బంధం చేశారు. మంగళవారం ఛలో బైంసా కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ముందస్తుగా ఆయనను అడ్డుకున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి అల్లర్లు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తో సహా మీడియాకు చెందిన పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరా తీశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని