Adi Srinivas: తెలంగాణ దాటితే కేసీఆర్‌ను ఎవరూ గుర్తుపట్టరు

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.

Published : 06 Jul 2024 03:47 IST

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్య

హైదరాబాద్, న్యూస్‌టుడే: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ దాటితే కేసీఆర్‌ను ఎవరూ గుర్తుపట్టరని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాలులో ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసింది భారాస ప్రభుత్వం కాదా? ఆయన్ను ఓడించింది రైతులే అన్న విషయాన్ని మర్చిపోతున్నారన్నారు. ఆయన దృష్టంతా అధికారంపైనే ఉందని విమర్శించారు. కేసీఆర్‌పై విశ్వాసం లేకనే ఆరుగురు భారాస ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కేసీఆర్‌ అని..ప్రగతిభవన్‌లో ఇతర పార్టీల నేతలను చేర్చుకున్నప్పుడు కేటీఆర్‌ ఏం చేశారని శ్రీనివాస్‌ ప్రశ్నించారు. నిరుద్యోగులు ఆందోళన చెందొద్దని, త్వరలోనే ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని