Rajasthan Crisis: రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభంపై భాజపా సెటైర్లు!
రాజస్థాన్(Rajasthan)లో అధికార కాంగ్రెస్(Congress)లో తలెత్తిన సంక్షోభంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హైడ్రామాతో.....
దిల్లీ: రాజస్థాన్(Rajasthan)లో అధికార కాంగ్రెస్(Congress)లో తలెత్తిన సంక్షోభంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హైడ్రామాతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని.. ఆ పార్టీ నేతలెవరూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉండటానికి ఇష్టపడటంలేదని, సీఎం పదవి లేదా రాష్ట్రాల్లో నేతలుగా ఉండటానికే ఇష్టపడుతున్నారంటూ భాజపా నేత సతీశ్ పూనియా విమర్శించారు. రాజస్థాన్‌లో గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య 2018లోనే సీఎం కుర్చీ కోసం డ్రామా మొదలైందని.. ఆ తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు కోసం.. సచివాలయంలో గదుల కోసం హైడ్రామా కొనసాగిందన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రాష్ట్ర ప్రజలే ఇబ్బందులు పడ్డారని పూనియా ధ్వజమెత్తారు.
నిజంగా రాజీనామాలు చేస్తేనే మంచిది: రాథోడ్
మరోవైపు, భాజపా సీనియర్ నేత, ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా కాంగ్రెస్‌లో సంక్షోభంపై స్పందించారు. ఈ డ్రామాకు తెరదించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు నిజంగా రాజీనామా చేస్తేనే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని.. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించడంతో రైతులు , యువత, మహిళలతో పాటు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విరుచుకుపడ్డారు.
మరోవైపు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి బరిలో అశోక్ గహ్లోత్ పోటీ చేయనుండటంతో ఆయన స్థానంలో కొత్త సీఎంగా ఎవరిని నియమించాలనే అంశం తెరపైకి రావడంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. గహ్లోత్ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న సచిన్ పైలట్‌కు సీఎం పదవి దక్కుతుందన్న వార్తల నేపథ్యంలో గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. హైకమాండ్ పంపించిన పరిశీలకుల బృందంతోనూ భేటీకి ఎమ్మెల్యేలు ఇష్టపడలేదు. పైలట్‌కు సీఎం పీఠం అప్పగిస్తే తామంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ అధిష్ఠానానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఇంకోవైపు, గహ్లోత్ కూడా సీఎం పదవిని వదులుకోవడానికి ఇష్టపడటంలేదు. సీఎం పదవితో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలనని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్‌కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్‌రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్‌కల్యాణ్‌తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్‌సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్‌సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్