
Telangana News: అంబేడ్కర్ పుణ్యమా అని మీరు సీఎం అయ్యారు.. కేసీఆర్‌పై లక్ష్మణ్ విమర్శలు
హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భాజపా నేడు భీమ్ దీక్ష చేపట్టింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతర భాజపా నేతలు దీక్షకు కూర్చున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, తుల ఉమ, భాజపా కార్పొరేటర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పుణ్యం వల్లే ఆయన నేడు ఒక రాష్ట్రానికి సీఎం కాగలిగారని దుయ్యబట్టారు.
‘‘దేశ పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం పట్ల కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బడ్జెట్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యాంగం విషయం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఎంతో మంది మహనీయులు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, మన దేశ పరిస్థితులకు అనుగుణంగంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. రెండేళ్లకు పైగా శ్రమించి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. అసమానతలు కూడిన దేశంలో సమానతలను తీసుకువచ్చేందుకు మహనీయులు కృషి చేశారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల పరిపాలన సులభం అవుతుందని చెప్పిన వ్యక్తి అంబేడ్కర్. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆయన పుణ్యమా అనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు’’ అని లక్ష్మణ్ విమర్శించారు. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని గౌరవించాల్సిన తెరాస, ఆ ప్రసంగాన్ని బహిష్కరించి అవమానపర్చిందంటూ ధ్వజమెత్తారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా రాజ్యాంగాన్ని, గవర్నర్‌ను అవమానపర్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అటు దేశ రాజధాని దిల్లీలోనూ భాజపా నేతలు దీక్ష చేపట్టారు. ఎంపీలు బండి సంజయ్, అర్వింద్, బాబూరావు తదితరులు కూర్చుని మౌన దీక్ష చేపట్టారు. గంట పాటు వీరు ఈ నిరసన చేపట్టనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవదహనం
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- కూనపై అలవోకగా..
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- లీజుకు క్వార్టర్లు!
- చెరువు చేనైంది
- Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
- తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట